Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

ఒకవైపు మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోతుండగా మరోవైపు భద్రతా దళాలు అడవుల్లో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

New Update
Encounter

Encounter

Maoist Encounter : ఒకవైపు మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోతుండగా మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వారికోసం భద్రతా దళాలు అడవుల్లో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం(chattisgarh maoist news) బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

Also Read :  సోషల్ మీడియా రారాజు మోదీ: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు!

Encounter In Chhattisgarh -Two Maoists Killed

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రతా దళాలు(security-forces) గురువారం ఉదయం బీజాపూర్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు(bijapur encounter) జరిగాయి.  జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రావతి నది వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూంబింగ్‌ నిర్వహించినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

ఈ క్రమంలోనే జాతీయ భద్రతా దళాలకు, మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరువురి మధ్య చాలా‌సేపటి వరకూ ఎదురు కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు. కొన్నిగంటలపాటు జరగిన కాల్పుల అనంతరం మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోవడంతో ఆ ప్రాంతంలో గాలించగా సంఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు గుర్తించారు. ఆ  మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Also Read :  ఇండియా కోళ్లు, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేదం.. మరో 40 దేశాలు

Advertisment
తాజా కథనాలు