Operation Sindoor : పహల్గాంలో టూరిస్టులపై దాడిచేసి అమాయకుల ప్రాణాలు తీసిన పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది.ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడిలో పెద్ద ఎత్తున ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ దశలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది.
పాక్‌లోని లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేస్తు్న్నట్లు ప్రకటించింది. ఇస్లామాబాద్, రావల్పిండి, బహ్వాల్‌పూర్ లో మెడికల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసింది. పాకిస్థాన్‌లోని వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాక్ పంజాబ్‌లోని విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అలర్ట్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు జరిగాయి. మొత్తం 9 చోట్ల దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో సుమారు 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకిటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మరో వైపు పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ.. భారత్ వ్యతిరేక కార్యకలాపాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.