Xai Grok: భారత్‌లో ఎక్స్‌ గ్రోక్‌ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్‌ మస్క్

ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్‌.. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత్‌లో గ్రోక్ ఏఐ తుపాను సృష్టిస్తోందని వచ్చిన కథనంపై మస్క్‌ స్పందిస్తూ ఎక్స్‌లో నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.

New Update
Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ గ్రోక్‌ చాట్‌బాట్‌ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొందరు వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. తాము అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌ తిట్లతో బదులిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, క్రీడలపై నిడాయతీగా సమాధానమిస్తోందని అంటున్నారు. 

Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు-వీడియో చూశారా?

భారత్‌లో గ్రోక్ ఏఐ తుపాను సృష్టిస్తోందని ఓ అంతర్జాతీయ మీడియాలో కూడా కథనం వచ్చింది. అయితే దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ రిపోర్టును షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మస్క్ పోస్టుకు అర్థమేంటని ఓ నెటిజన్ ఏఐ చాట్‌బాట్‌ను ప్రశ్నించగా.. భారత్‌లో ఈ రాజకీయ వివాదం నవ్వు తెప్పించేలా ఉందని ఆయన భావిస్తున్నట్లు చెప్పింది.     

Also Read: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?

ఇదిలాఉండగా.. ఇటీవల మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ ఈ గ్రోక్ చాట్‌బాట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ భూమిపై అత్యంత తెలివైన ఏఐ టూల్ అని మస్క్ అన్నారు. అయితే ఇటీవల యూజర్లు అడిగే ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. హిందీ యాసను సైతం ఈ ఏఐ చాట్‌బాట్‌ వినియోగిస్తుంది. ఇందులో కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉండటం వివాదానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించింది. ఈ వివాదంపై ఎక్స్‌ ప్రతినిధులతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ అధికారులు సంప్రదింపులు జరుగుతున్నట్లు అధికార వర్గాల చెబుతున్నాయి. 

Also Read: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

elon-musk | telugu-news | rtv-news | grok ai | elon musk grok ai

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు