Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు-వీడియో చూశారా?

ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శిరావనేలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.

New Update
Massive fire breaks out in Maharashtra Industrial Development Corporation

Massive fire breaks out in Maharashtra Industrial Development Corporation

ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శిరావనేలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్నిఅందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో భారీ పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రమాదంపై అగ్నిమాపక అధికారి ఎస్ఎల్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘ సంఘటనా స్థలంలో పన్నెండు అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎవరూ గాయపడలేదు. మంటలకు గల కారణం ఇంకా తెలియరాలేదు’’ అని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..

ఇలాంటిదే మరో ప్రమాదం

ఇలాంటిదే హౌరాలోని ధూలాఘర్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంక్రైల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూలాఘర్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలముకుంది. పొగలు రావడంతో కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

15 ఫైర్ ఇంజన్లు

దీంతో మొదట 5 నుంచి 6 ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలు ప్రయత్నించినా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పలేకపోయింది. దీంతో రాత్రి 7:30 గంటలకు దాదాపు 15 ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటలను అదుపుచేయలేకపోయినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యాక్టరీ లోపల ఎవరూ చిక్కుకోలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

Also Read: బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు

ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందనే దానిపై స్థానికులు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్లాస్టిక్ సంచులతో సహా వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తుందని అంటున్నారు. మండే గుణం ఉన్న పదార్థాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, 3 కిలోమీటర్ల దూరం నుండి నల్లటి పొగ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

కాగా ఈ ఫ్యాక్టరీలో 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఫ్యాక్టరీ వర్క్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. అయితే ఫ్యాక్టరీలో మంటలను గమనించిన వెంటనే దగ్గర్లో ఉన్న కార్మికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు