/rtv/media/media_files/2025/07/22/election-commission-2025-07-22-21-23-51.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీయులు అక్కడ భారీగా ఓటర్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈక్రమంలో మంగళవారం భారీగా ఓటర్లను తొలగించింది. ఏకంగా 52 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేసింది సీఈసీ. రద్దు చేసిన 52 లక్షల మంది ఓటర్లలో 18 లక్షల మంది చనిపోయినవాళ్లు కాగా.. 26 లక్షల మంది ఇతర నియజకవర్గాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. మరో 7 లక్షల మంది రెండు దఫాలుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే.. ఈ విషయమై రాజకీయ పార్టీలు అందోళన చెందవద్దని.. ఆగస్టు 1వ తేదీ వరకూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపింది ఎన్నికల సంఘం.
52.3 lakh names removed from Voter's list so far as part of Bihar SIR by Election Commission of India . #BiharElections2025pic.twitter.com/zf6DxFdwb4
— With Love Bihar (@WithLoveBihar) July 22, 2025
బిహార్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యను వెల్లడించానికి రెండు రోజుల ముందే కేంద్ర ఎన్నికల సంఘం వడబోతను వేగవంతం చేసింది. ప్రధానంగా 2 అంశాలను ప్రమాణికంగా తీసుకొని 52 లక్షల ఓటర్లను తొలగించింది. చనిపోయిన, ఇతర నియోజక వర్గాలకు వలస వెళ్లిన వాళ్ల పేర్లను మాత్రమే జాబితా నుంచి తప్పించామని సీఈసీ వెల్లడించింది.