మహారాష్ట్రను ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమి ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనుమనాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై తాజాగా ఎన్నికల సంఘం (EC) స్పందించింది. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు రావాలని తెలిపింది. '' ఎన్నికలు ప్రతీ దశలో కూడా పారదర్శకంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న చట్టపరమైన ఆందోళనలను మేము పరిశీలిస్తాం.
Also Read: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం
Election Commission
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత మేము రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని'' కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సంఘం ఆహ్వానించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీకి కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది.
Also Read: దేశానికే అవమానం.. బంగ్లాదేశ్ విద్యార్థులు ఇండియా జాతీయ జెండాపై..
ఇదిలాఉండగా.. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీకి 132 సీట్లు సొంతం చేసుకోగా.. శివసేన(షిండే)కు 57, ఎన్సీపీ (అజిత్ పవార్)కు 41 సీట్లు దక్కాయి. విపక్ష మహావికాస్ అఘాడి ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచింది. శివసేన(UBT) 20 , ఎన్సీపీ (శరద్ పవార్) 10 సీట్లు దక్కించుకున్నాయి.
Also Read : ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!
Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి