/rtv/media/media_files/2025/04/15/mYfJQcosMgKQBQUdOi7x.jpg)
Priyanka gandhi and Robert Vadra
కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై షికోపుర్ ల్యాండ్స్ కేసులో ED తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని పలుమార్లు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిపించి ప్రశ్నించింది. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.
Also Read:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Robert Vadra
Gurugram land deal case: ED attaches 43 properties of Robert Vadra; files chargesheet against him, 10 others
— ANI Digital (@ani_digital) July 17, 2025
Read @ANI Story | https://t.co/pCZhW5ZG3u#RobertVadra#GurugramLandDeal#EDpic.twitter.com/cSR7rUmts2
ఈ కేసుకు సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వాద్రా పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఆయనతోపాటు నాటి హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్, ఓ ప్రాపర్టీ డీలర్ పేరును దీనిలో ప్రస్తావించారు. దీనిలో అవినీతి, ఫోర్జరీ చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి.
Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!
ఇది కూడా చదవండి:కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి
latest-telugu-news | robert-vadra