Earthquake Today: ఒకేసారి రెండు భారీ భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు

భారత్, ఆస్ట్రేలియాలో ఒకేసారి రెండు భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని అండమాన్, నికోబర్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. అలాగే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైంది. 

New Update
Earthquake

Earthquake

గత కొన్ని రోజులుగా భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఊహించని విపత్తు ఎన్నో నగరాలను నేలమట్టం చేసింది. భారతదేశంతో పాటు పలు దేశాలలో భూప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. తాజాగా మరోసారి భూమి కదిలింది. నిన్న (సోమవారం) రాత్రి రెండు దేశాల భూమిని భూకంపం కుదిపేసింది. 

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

భారతదేశం, ఆస్ట్రేలియాలో భూకంపం సంభవించింది. భారత్‌లోని అండమాన్, నికోబార్ దీవులలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. అదే సమయంలో ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో భూకంపం వల్ల ప్రజలు వణికిపోయారు. ఈ ప్రదేశాలలో అర్ధరాత్రి తర్వాత భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 కంటే ఎక్కువగా నమోదు అయింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఇది కూడా చూడండి: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

అండమాన్, నికోబార్ దీవులలో భూకంపం

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. నిన్న రాత్రి 12:41 గంటలకు అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు. సునామీ హెచ్చరిక కూడా జారీ చేయలేదు. 

ఇది కూడా చూడండి: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

ఆస్ట్రేలియా భూకంపం

మరోవైపు అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున 3:40 గంటలకు ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. 

Advertisment
తాజా కథనాలు