/rtv/media/media_files/2026/02/05/ai-effect-2026-02-05-11-18-19.jpg)
AI Effect
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పెను మార్పులు సృష్టిస్తోంది. ఈ ప్రభావం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఇప్పుడు మీడియా రంగాన్ని కూడా కుదిపేస్తోంది. ప్రముఖ వార్తాపత్రికలలో ఒకటిగా పేరుగాంచిన 'వాషింగ్టన్ పోస్ట్' తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్ తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు మూడో వంతు మందిని తొలగించింది. వీరిలో ఇతర సిబ్బందితో పాటు జర్నలిస్ట్‌లు కూడా ఉన్నారు. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కానీ ఏఐ ప్రభావం వల్ల పనుల వేగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భారీగా ఉద్యోగస్తులను తొలగించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు.. ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!
Mass layoffs rock The Washington Post.
— IndiaToday (@IndiaToday) February 5, 2026
Ishaan Tharoor, son of Congress MP Shashi Tharoor, is among the journalists laid off. India Today's @JournoPranay with all the latest updates.#News#IndiasAgenda@snehamordanipic.twitter.com/yrwY14bmTQ
కాంగ్రెస్ ఎంపీ కొడుకు..
ఈ లేఆఫ్స్(big-layoffs) లో భారత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనయుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు. ఇషాన్ 2014 నుంచి ఈ పత్రికలో పనిచేస్తున్నారు. ఆయన 2015లో 'వరల్డ్ వ్యూ' అనే కాలమ్‌ను ప్రారంభించి అంతర్జాతీయ వ్యవహారాలపై విశ్లేషణలు అందించేవారు. తనకు దాదాపు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలిపారు. తనతో పాటు ఇంకా అనేక మంది అంతర్జాతీయ సిబ్బందిని తొలగించడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ భారీ తొలగింపుల పట్ల మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మార్టీ బారన్ స్పందిస్తూ.. ఇది జర్నలిజం సమాజానికే ఒక "చీకటి రోజు" అని అభివర్ణించారు. ఎంతో అనుభవం, అంకితభావం ఉన్న వ్యక్తులు ఇలా రోడ్డున పడటం బాధాకరమని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, మానవ వనరుల అవసరం తగ్గుతుందనే వాదనలకు ఈ లేఆఫ్స్ ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాయని అన్నారు.
ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
‘द वॉशिंग्टन पोस्ट’मध्ये मोठी कर्मचारी कपात; शशी थरूर यांचे चिरंजीव इशान थरूर यांनीही नोकरी गमावली.
— म₹1ठी स्टॉक (@marathistock) February 5, 2026
अमेरिकेतील नामांकित वृत्तपत्र The Washington Post मध्ये सुरू असलेल्या कपातीचा फटका भारतीय काँग्रेस खासदार शशी थरूर यांचे चिरंजीव व प्रसिद्ध पत्रकार ईशान थरूर यांनाही बसला आहे. pic.twitter.com/zThPCeWs7J
Follow Us