Layoffs : ఉద్యోగులకు షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. 4 వేల మంది ఔట్!
ప్రస్తుతం లేఆఫ్స్ ల కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. తాజాగా తొషిబా సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం లేఆఫ్స్ ల కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. తాజాగా తొషిబా సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది.
అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది.
ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు.