తినేది ఇండియా తిండి, పాడేది పాకిస్తాన్ పాట.. DRDO ఉద్యోగి అరెస్టు!

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
pak gudachari

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలపై  రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నివాసిగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు కీలకమైన, వ్యూహాత్మక సమాచారాన్ని పంపాడు. మహేంద్ర ప్రసాద్ DRDO శాస్త్రవేత్తలు, భారత సైన్యం అధికారులు చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించినప్పుడు వారి కదలికలు, మిస్సైల్, ఇతర ఆయుధాల పరీక్షలకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. 

నిఘా పెట్టిన తర్వాత

ఈ కేసుపై నిఘా ఏజెన్సీలు కొన్ని వారాల పాటు నిఘా పెట్టిన తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, పాక్ హ్యాండ్లర్‌లతో అతడు చాట్ చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసును అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద నమోదు చేశారు. అతన్ని బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు ఈ అరెస్ట్ భారత రక్షణ సంస్థలలో భద్రతాపరమైన లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ దేశ వ్యతిరేక, విధ్వంసక కార్యకలాపాలపై నిఘా పెంచిందని సిఐడి (సెక్యూరిటీ) ఐజి డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు.

Also Read : Wife Affair : బెస్ట్ ఫ్రెండ్ భార్యతో అక్రమసంబంధం... పాపం లవర్తో కలిసి చంపేసిన భార్య!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత

పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ గూఢచార సంస్థలు (ISI)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా పలువురిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ కేసుల్లో అనేక మంది యువకులు, ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలు కూడా హనీట్రాప్ మరియు డబ్బు ఆశకు లొంగిపోయి కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసినట్లు వెల్లడైంది. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, పాక్ గూఢచారులకు హనీట్రాప్‌లలో సహాయం చేసిందని, భారత సైనిక స్థావరాల గురించి కీలక సమాచారాన్ని చేరవేసిందని పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి విచారణ జరిపారు. రాజస్థాన్‌లోని డీగ్ ప్రాంతానికి చెందిన ఖాసిం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌లోని వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, అతడు పాకిస్తాన్‌లో కూడా పర్యటించినట్లు దర్యాప్తులో తెలిసింది.  గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ అనే ఆరోగ్య కార్యకర్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఒక పాకిస్తానీ మహిళా ఏజెంట్ హనీట్రాప్‌లో చిక్కుకొని, భారత సైన్యం, నావికాదళానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రూ. 40,000 తీసుకుని పంపాడు.   

Advertisment
తాజా కథనాలు