Wife Affair : బెస్ట్ ఫ్రెండ్ భార్యతో అక్రమసంబంధం... పాపం లవర్తో కలిసి చంపేసిన భార్య!

39 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపింది ఎవరో కాదు.. తన చిన్ననాటి స్నేహితుడే.  స్నేహితుడే భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను ప్రియురాలి మోజులో పడి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు.

New Update
murder ka

బెంగళూరులో 39 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపింది ఎవరో కాదు.. తన చిన్ననాటి స్నేహితుడే.  స్నేహితుడే భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను ప్రియురాలి మోజులో పడి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్, ధనంజయ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. బెంగళూరులోని మాగడిలో 30 ఏళ్లు కలిసి పెరిగారు.   రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ లావాదేవీలు చేసే విజయ్ కు  దాదాపు పదేళ్ల క్రితం ఆశాతో వివాహం జరిగింది. ఈ జంట కామాక్షిపాల్యలో నివాసం ఉంటున్నారు. విజయ్ భార్యకు ధనంజయ్ తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం విజయ్ కి తెలియడంతో స్నేహన్ని,భార్యను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాపురాన్ని  మాచోహళ్లికు మార్చాడు.

Also Read :  Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్‌ .. ఆ రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌

విజయ్ కు తెలియకుండా

అక్కడ అద్దెకు తీసుకుని భార్యతో ఉంటున్నాడు. అయినప్పటికీ భార్య తీరు మారలేదు. విజయ్ కు తెలియకుండా భర్త స్నేహితుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్త అడ్డు తొలిగించుకుంటే తప్ప ప్రియుడితో సుఖంగా ఉండలేనని భావించిన భార్య పెద్ద స్కెచ్ వేసింది. భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. సాయంత్రం ఇంటినుంచి బయలుదేరిన విజయ్ ను ధనుంజయ్ చంపేసి పారిపోయాడు. విజయ్ మృతదేహం మచ్చోహళ్లిలోని డిజి గ్రూప్ లేఅవుట్ ప్రాంతంలో దొరికింది.  ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఆశా, ధనంజయ్ కలిసి విజయ్ హత్యకు కుట్ర పన్నారని విచారణలో తేల్చారు. పోలీసులు ఆశాను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడైన స్నేహితుడు ధనంజయ్ పరారీలో ఉన్నాడు.  పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

మంచిర్యాలలో ముదనష్టపు లవర్

మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్‌. నాలుగు సంవత్సరాలుగా అనూషకు, శ్రీకాంత్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దల నిరాకరించారు. అయితే డబ్బులు, నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానన్నాడట శ్రీకాంత్‌.  తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే..వారిద్దరి సన్నిహిత ఫోటోలు బయటపెడతానంటూ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో శ్రీకాంత్‌ మోసం చేశాడన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ప్రాణాలు తీసుకుంది. అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. అనూషను శ్రీకాంత్‌ తరుచూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ ప్రమోద్ తెలిపారు. 

Also Read :   Snake In Curry Puff : ఇదెందయ్యా..ఇది  కర్రీ పఫ్‌ లో పాము పిల్ల.. షాక్ తో ఆ మహిళ ఏం చేసిందంటే..

Advertisment
తాజా కథనాలు