DRDO మరో సంచలనం.. ప్రళయ్‌ క్షిపణి సక్సెస్

భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఒకే లాంచర్‌ నుంచి రెండు మిసైల్స్‌ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది.

New Update
DRDO successfully conducts salvo launch of two Pralay missiles in quick succession

DRDO successfully conducts salvo launch of two Pralay missiles in quick succession

భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఒకే లాంచర్‌ నుంచి రెండు మిసైల్స్‌ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు పేర్కొంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో ఈ ప్రయోగం నిర్వహించారు. 

Also Read: వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

ఈ రెండు క్షిపణులు నిర్దేశిత మార్గంలో వెళ్లి టార్గెట్‌ను కచ్చితత్వంతో చేధించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాకింగ్‌ సెన్సార్ల ద్వార మిసైల్‌ పనితీరును ధృవీకరించారు. DRDO సీనియర్ శాస్త్రవేత్తలు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని వీక్షించారు. ప్రళయ్ మిసైల్ అనేది 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్‌లను ఛేదించగలదు. దీన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతోనే  తయారుచేశారు. అడ్వాన్స్‌డ్ నావిగేషన్, గైడెన్స్‌ సిస్టమ్‌లతో ఈ క్షిపణి పనిచేస్తుంది.  

Also Read: మూడు గంటల పాటూ నరకం..కదులుతున్న కారులో రేప్..

ఈ మిసైల్ వివిధ రకాల వార్‌హెడ్‌లను మోసుకెళ్లి శత్రువులపై దాడులు చేయగలదు. హైదరాబాద్‌లో రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) , DRDO ల్యాబ్స్‌,  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సంస్థల సహకారంతో ఈ క్షిపణిని తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ క్షిపణి వ్యవస్థను సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని DRDO ఛైర్మన్ డా. సమీర్‌ వి కామత్ మాట్లాడారు. 

Advertisment
తాజా కథనాలు