Dogs: గంటకు 14 మందిని కరుస్తున్న శునకాలు

ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీధుల్లో రెండు ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

New Update
Dogs bites 14 people per hour in telangana

Dogs bites 14 people per hour in telangana

దేశంలో కుక్కల బెడద అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలను షెల్టర్‌కు తరలించాలని తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు వీధి కుక్కులకు టీకాలు, డీవార్మింగ్ వేయించి మళ్లీ అవి ఉంటున్న ప్రాంతాల్లో వదిలేయాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు తెలంగాణలో కూడా ఇటీవల కుక్కల బెడత అంశం చర్చనీయమైన సంగతి తెలిసిందే. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో వాటి సంఖ్య చాలా ప్రాంతాల్లో పెరిగిపోయాయి. 

Also Read: ఆఫీస్‌లో అదనపు గంటలు పనిచేస్తున్నారా ? సర్వేలో షాకింగ్ నిజాలు

ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీధుల్లో రెండు ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 13 మంది రేబిస్ వ్యాధికి గురై మృతి చెందారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలకు వెళ్తున్నప్పుడు లేదా విధీలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా కుక్క కాటుకు గురవ్వడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని శునకాలు కరిచాయి. ఈ ఏడాది చూసుకుంటే జనవరి నుంచి జులై వరకు 87,366 మందిని కరిచాయి. 

Also Read: అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు

దేశవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 37 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్‌ మరణాల్లో భారత్‌ నుంచే 36 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో కూడా ఎక్కవ మొత్తంలో 15 ఏళ్ల లోపు ఉన్నవారే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీలో రోడ్లపై వీధి కుక్కుల కనిపించొద్దని వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని తీర్పునిచ్చింది. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. జంతు ప్రేమికులు, పలువురు సెలబ్రిటీలు శునకాల పట్ల కరుణ చూపించాలని కోరారు. మరికొందరు నిరసనలు కూడా చేశారు. చివరికి దీనిపై వెనక్కి తగ్గిన అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు టీకాలు, డీవార్మింగ్‌ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.    

Also Read: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?

మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా 2023లో నమోదైన కుక్క కాటు కేసులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో GHMC తీసుకుంటున్న చర్యలు, దేశంలో చట్టాల గురించి GHMC కోర్టుకు అనేక విషయాల్లో ప్రమాణపత్రం సమర్పించింది. అయితే భారత్‌లో జంతువుల పట్ల క్రూతర్వ నిరోధక చట్టం 1960 ఉంది. దీనిక ప్రకారం హాని చేసే శునకాలకు ప్రశాంత మరణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. 

Also read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్‌ నిందితునిపై పోలీసుల కాల్పులు

ఇదిలాఉండగా యూకే, అమెరికా, సింగపూర్‌ వంటి తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్‌లో అయితే వీధిలో శునకం కనపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో దాన్ని ఎవరూ తీసుకెళ్లకపోతే ప్రశాంత మరణం కల్పిస్తారు. మలమూత్ర విసర్జనకు, వాకింగ్‌కు కూడా వాటిని రోడ్లపైకి తీసుకురావొద్దు. పెంపుడు కుక్కలను పోషించలేని పరిస్థితి వచ్చినా కూడా ప్రభుత్వానికి అప్పగించాలి. వీధుల్లో వదలేయవద్దు. ఇక నెదర్లాండ్‌లో అయితే వీధి కుక్కలే ఉండవు. ప్రపంచంలోనే వీధి కుక్కలు లేని మొదటి దేశంగా నెదర్లాండ్ గుర్తింపు పొందింది. 

Advertisment
తాజా కథనాలు