/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t074830631-2025-11-25-07-53-31.jpg)
mumbai crime branch
Mumbai Crime Branch: అదొక రెండంతస్తుల రాతి భవనం. 1908లో నిర్మితమైన ‘మలాడ్ స్టోన్స్’ ఉపయోగించి నిర్మించిన ఆ భవనంలో 1909 జూన్ 9న ఇంపీరియల్ పోలీస్ ఆఫీసర్ ఎప్.ఏ.ఎం.హెచ్.విన్సెంట్ ఆధ్వర్యంలో అందులో సీఐడీ కార్యాలయం ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి క్రైమ్ బ్రాంచ్‌ను నిర్వహిస్తోంది. 1993 ముంబై పేలుళ్ల దర్యాప్తు సమయంలో 26/11 దాడిదారు అజ్మల్ కసబ్, అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం, అబూ జుందాల్, గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లి , నటుడు సంజయ్ దత్ వంటి పేరుమోసిన నేరస్థులు మరెంతో మంది ఉగ్రవాదుల విచారణకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పాత భవనం త్వరలో కనుమరుగు కానుంది.
స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాతంత్ర్య యోధుడు బాలగంగాధర తిలక్‌ను అరెస్టు మొదలు.. ముంబయి దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ విచారణ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ భవనం వేదికగా నిలిచింది. 117 ఏళ్ల చరిత్ర కలిగి ముంబయి పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఈ కట్టడాన్ని త్వరలో కూల్చివేయనున్నారు. రెండంతస్తుల ఈ భవనం పూర్తిగా స్థితిలావస్థకు చేరుకుంది. ఇది ఇక ఏ మాత్రం సురక్షితం కాదని, మరమ్మతులు చేయలేని స్థితికి చేరుకుందని నిపుణులు తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
ఈ భవనం కూల్చివేసిన అనంతరం ఈ స్థలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆరంతస్తుల భవనం నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముంబయి నగర మొదటి డీసీపీ (సీఐడీ)గా ఉన్న ఇంపీరియల్ పోలీస్ ఆఫీసర్ ఎప్.ఏ.ఎం.హెచ్.విన్సెంట్ ఆధ్వర్యంలో తొలిసారి ఇందులో సీఐడీ కార్యాలయం ప్రారంభమైంది. బ్రిటిష్ కాలంలో ముంబయి పోలీస్‌కు చెందిన రాజకీయ నిఘా, ఫారిన్ బ్రాంచ్, క్రైమ్ బ్రాంచ్ విభాగాలు ఈ భవనం నుంచే పనిచేసేవి. ఇదిలా ఉండగా తీవ్రమైన నేరాల దర్యాప్తు కోసం 1920లో డీసీపీ (క్రైమ్) పదవిని సృష్టించారు.
Also Read: బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య మరో సంచలన డిఫెన్స్ డీల్..
వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న అండర్‌వరల్డ్ డాన్‌లు ఛోటా రాజన్, అరుణ్ గావ్లీ, అబూ సలేం, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వంటివారిని ఇక్కడే విచారించడం గమనార్హం. 1925లో సంచలనం సృష్టించిన బావ్లా హత్య కేసునూ సైతం ఇక్కడే దర్యాప్తు చేశారు. క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ భవనంతో అత్యంత భావోద్వేగ సంబంధం ఉందని పోలీసు చరిత్రకారుడు దీపక్ రావు ‘పీటీఐ’ వార్తాసంస్థకు తెలిపారు. ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయే ముందు ఈ భవనంతో అనుబంధం ఉన్న పూర్వ అధికారులు ఆఖరుసారి దీన్ని సందర్శించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
Also Read: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
కాగా , ఈ భవనం ముందు భాగం ఇప్పటికీ స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ, వెనుక భాగంలో ఉన్న ఇనుప దూలాలు తీవ్రంగా తుప్పు పట్టాయి, దీని వలన నిర్మాణం సురక్షితం కాదని, నిర్మాణాత్మక ఆడిట్ వెంటనే కూల్చివేతకు సిఫార్సు చేసింది."ముంబై పోలీస్ వ్యవస్థ విస్తరించింది. అందుకు తగినట్లు ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు లేవు. తీవ్రమైన స్థల కొరతను ఎదుర్కొంటున్నాము. ఈ భవనం మరమ్మత్తు చేయలేని స్థితిలో ఉన్నందున, దానిని కూల్చివేసి దాని స్థానంలో కొత్త, ఆధునిక భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం' అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Also Read: వాట్సాప్ హ్యాకింగ్ ఎలా జరుగుతుందో తెలుసా?
ఇక నూతనంగా నిర్మించ తలపెట్టిన కొత్త ఆరు అంతస్తుల భవనంలో క్రైమ్ బ్రాంచ్ కార్యాలయాలు, ఆధునిక CCTV పర్యవేక్షణ కేంద్రం,పరిపాలనా విభాగాలు, సమావేశమందిరం, సమావేశ గదులు నిర్మించనున్నారు.నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న క్రైమ్ బ్రాంచ్ యూనిట్లను కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలోని కొత్త పరిపాలనా భవనంలోకి తాత్కాలికంగా మార్చనున్నారు.
Follow Us