/rtv/media/media_files/2025/12/30/digital-discounts-on-unreserved-rail-tickets-2025-12-30-18-50-02.jpg)
Digital Discounts on Unreserved Rail Tickets
రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ యాప్‌లో అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్‌లో చేసినా కూడా 3 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఈ యాప్‌లో ఆర్‌వాలెట్ ద్వారా చెల్లింపులు చేసిన వాళ్లకి క్యాష్ వస్తోంది. ఇది అన్ని డిజిటల్ పేమెంట్లకు విస్తరించారు.
Also Read: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
అయితే ఈ ఆఫర్‌కు తగ్గట్లు సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లో మార్పులు తీసుకురావాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)కు రైల్వే శాఖ సూచనలు చేసింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు పేర్కొంది. ఆర్‌వాలెట్ నుంచి కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఉంటుందని పేర్కొంది. కానీ ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కొనే అన్‌రిజర్వుడు టికెట్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది.
Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్
రైల్‌వన్ యాప్ అంటే?
రైళ్లలో దూర ప్రయాణాలు చేసేవారికి ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ఉంది. టికెట్ల బుకింగ్ కోసం, జర్నీలో ఫుడ్ కోసం , ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం, ట్రైన్ లైవ్ ట్రాకింగ్ కోసం ఇలా ఎన్నో యాప్‌లు ఉన్నాయి. అందుకే వీటన్నింటినీ ఒకే చోటుకి చేర్చాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేశాఖ ఈ రైల్‌వన్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లతో సహా ప్లాట్‌ఫామ్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
Follow Us