Dharmasthala Case: ధర్మస్థలలో మరో అస్థిపంజరం.. ఒంటిపై చొక్కా, మెడకు ఉరి

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ధర్మస్థలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఈ కేసు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న సిట్ కు ఇప్పటివరకు 11 ప్రాంతాలలో అనుమానాస్పద మానవ అవశేషాలు లభ్యమయ్యాయి.

New Update
dharamasthali case

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ధర్మస్థలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఈ కేసు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న సిట్ కు ఇప్పటివరకు 11 ప్రాంతాలలో అనుమానాస్పద మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డాయి. దాని ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరి వేసుకున్నట్లు తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. ఈ అవశేషాలు ఒక మగవారివి కావచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి నిర్ధారణ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. దీనికి సంబంధించిన  నిజానిజాలను వెలుగులోకి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. 

100కు పైగా మృతదేహాలను

ఒకప్పుడు ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అతను 1995-2014 మధ్యకాలంలో 100కు పైగా మృతదేహాలను తనచేత బలవంతంగా పాతిపెట్టించారని కోర్టులో తెలిపాడు.  అందులో మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారని, వారిలో కొందరు లైంగిక వేధింపులకు గురైన తర్వాత హత్య చేయబడ్డారని ఆరోపించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక సర్కార్ నలుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 11 ప్రాంతాలలో తవ్వకాలు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా నేల జారడం, అవశేషాలను గుర్తించడం కష్టమవుతున్న నేపథ్యంలో, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (GPR) టెక్నాలజీని ఉపయోగించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సిట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని

మరోవైపు ఇదే కేసులో మరో ప్రత్యక్ష సాక్షి అయిన జయంత్ అనే వ్యక్తి కూడా SITకి వాంగ్మూలం ఇచ్చారు. తాను 15 సంవత్సరాల క్రితం 13 నుంచి 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చూశానని, దాని గురించి పోలీసులకు చెప్పినా పోస్టుమార్టం నిర్వహించకుండానే ఖననం చేశారని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. తాను మరిన్ని ఖననాల గురించి ప్రత్యక్షంగా చూశానని, స్థానికులకు కూడా ఈ విషయాలు తెలుసని, అయితే భయం వల్ల ఎవరూ బయటకు రావట్లేదని ఆయన తెలిపారు. జయంత్ ఒక ఆర్టీఐ కార్యకర్త.  ఆర్టీఐ ద్వారా పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. తప్పిపోయిన వ్యక్తుల డేటా మరియు ఛాయాచిత్రాలను తనకు అందించమని తాను గతంలో బెల్తంగడి పోలీస్ స్టేషన్‌ను అభ్యర్థించానని, కానీ పోలీసులు వింతైన సమాధానం ఇచ్చారని జయంత్ చెప్పాడు. మరో విషయం ఏంటంటే, 2000 నుంచి 2015 మధ్యకాలంలో ధర్మస్థల, బెళ్తంగడి, ఉజిరే పోలీస్ స్టేషన్లలో నమోదైన అసాధారణ మరణాలకు సంబంధించిన రికార్డులు అదృశ్యమయ్యాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా బయటపడింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : BRS party : మేం పార్టీ మారడం లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేలు!

Advertisment
తాజా కథనాలు