stampede: భక్తుల ప్రాణాలు తీస్తున్న పుకార్లు.. విషాదంగా మారుతున్న దైవదర్శనాలు

వరుసగా 2 రోజు దేవాలయాల్లో తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

New Update
Stampede

దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు శాశ్వత లోకాలకు వెళ్లిపోయారు. వరుసగా రెండు రోజు దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌ బారాబంకిలోని అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. అయితే ఈ రెండు తొక్కిసలాటకు కారణం విద్యుత్ తీగలు తెగిపోయాయని పుకార్లు వ్యాపించడమే కారణం.

శ్రావణమానంలో మూడవ సోమవారం శివుడికి జలాభిషేక చేస్తే మంచి జరుగుతుందని భక్తును నమ్ముతారు. దీనికోసమే భక్తులు అవసనేశ్వర్ ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. బారాబంకిలోని హైదర్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఆవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివ భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. పవిత్రమైన మూడవ సోమవారంని భక్తులు ఎంతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటిస్తారు. హిందూ మతంలో శివుడికి అంకితం చేయబడిన శ్రావణ సోమవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూజ, ఉపవాసాలు చేస్తుంటారు.

devotees | stampede | Manasa Devi temple | uttara-pradesh | uttarakhand | temple  

Advertisment
తాజా కథనాలు