/rtv/media/media_files/2025/11/15/youtuber-manish-kashyap-2025-11-15-14-13-31.jpg)
Despite 9.6 million followers, YouTuber Manish Kashyap loses Bihar Assembly seat by 50,366 votes
అతను యూట్యూబ్‌లో పాపులర్. 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో జన్‌సరాజ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అతనే మనీశ్ కశ్యప్. చన్‌పటియా నియోజకవర్గం నుంచి అతడు బరిలోకి దిగాడు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్.. బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్‌పై 37 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 34 ఏళ్ల మనీశ్ కశ్యప్ సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: ఇండియన్ సిక్కు మహిళ.. మతం మార్చుకుని, పాక్ వ్యక్తిని వివాహం!
బీహార్ వలస కూలీలపై ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న దాడుల గురించి 2023లో మనీశ్ చేసిన వీడియోలకు మంచి పాపులారిటీ వచ్చింది. తమిళనాడులో వలస కూలీలను చంపుతున్నారని చేసిన వీడియోలు వైరల్ కావడంతో తమిళనాడు, బీహార్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో అవి ఫేక్ వీడియోలని తేలాయి. దీంతో వలసకూలీలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు మనీశ్‌ను అరెస్టు చేశారు.
Also Read: దర్యాప్తు చేస్తూ సీనియర్ పోలీసు అధికారి, మెజిస్ట్రేట్ తో సహా తొమ్మిది మంది..
ఆ తర్వాత మనీశ్ 2024లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత జన్‌సురాజ్ పార్టీలో చేరారు. చన్‌పటియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు. కానీ అక్కడి ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించారు. ఇదిలాఉండగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 స్థానాలకు పైగా గెలిచి మరోసారి అధికారం పీఠం దక్కించుకుంది.
Follow Us