/rtv/media/media_files/2025/11/15/marriage-2025-11-15-11-07-30.jpg)
గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ 52 ఏళ్ల మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన ఈ మహిళ చర్యతో భారత భద్రతా, విదేశాంగ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన సర్వజిత్ కౌర్ (52) అనే ఓ మహిళ గురునానక్ దేవ్ 555వ జయంతి సందర్భంగా నవంబర్ 4న 1,992 మంది యాత్రికులతో కూడిన బృందంలో ఆమె వాఘా-అట్టారీ సరిహద్దు గుండా పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. 10 రోజుల పాటు చారిత్రక గురుద్వారాలను సందర్శించిన యాత్రికుల బృందం నవంబర్ 13న భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఈ బృందంలో సర్వజిత్ కౌర్ లేరు. భారత్‌లోకి ప్రవేశించిన ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో ఆమె పేరు లేకపోవడంతో, ఆమె పాక్‌లోనే మిస్ అయింది. - Indian Sikh Woman Missing
Also Read : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా చిరాగ్ పాశ్వాన్?
Big Expose🚨‼️
— Prof. Marquina Singh Sergio (@profmarquinas) November 14, 2025
An indian Woman Sarbiit kaur(fake name)who travelled to Pakistan with sikh pilgrims is an Indian agencies asset. She was planted in jatha by the govt. of india🇮🇳and her action was to defame Sikh community worldwide and make a rift between Pakistan and Sikhs . https://t.co/eXpxBJoi1qpic.twitter.com/RxovbDOrDS
Also Read : దర్యాప్తు చేస్తూ సీనియర్ పోలీసు అధికారి, మెజిస్ట్రేట్ తో సహా తొమ్మిది మంది..
ఇస్లాం మతాన్ని స్వీకరించి
సర్వజిత్ కౌర్ అదృశ్యమైన కొద్ది రోజులకే ఉర్దూ భాషలో ఉన్న ఒక నిఖా నామా (ఇస్లామిక్ వివాహ ఒప్పంద పత్రం) వెలుగులోకి వచ్చింది. ఆ పత్రం ప్రకారం, ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. మత మార్పిడి తర్వాత ఆమె తన పేరును నూర్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. షేక్‌పురాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని నూర్ సర్వజిత్ కౌర్ వివాహం చేసుకున్నట్లు ఆ పత్రంలో ఉంది. సర్వజిత్ కౌర్‌కు గతంలోనే విడాకులయ్యాయి. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు గత 30 ఏళ్లుగా మాజీ భర్త కర్నైల్ సింగ్‌తో కలిసి ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. పాకిస్థాన్ మంత్రి రమేష్ అరోరా ఈ విషయంపై స్పందిస్తూ, సర్వజిత్ కౌర్‌ను అరెస్ట్ చేసి, ఆమెను తిరిగి భారత్‌కు పంపించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) ప్రతి సంవత్సరం పాకిస్తాన్‌లోని చారిత్రాత్మక గురుద్వారాలకు, ముఖ్యంగా గురునానక్ ప్రకాష్ పర్వ్‌కు నివాళులు అర్పించడానికి యాత్రికుల బృందాన్ని పంపుతుంది. గత నెలలో భద్రతా కారణాల దృష్ట్యా యాత్రకు అనుమతి లభించలేదు. రెండు వారాల తర్వాత సరిహద్దు అవతల ఉన్న నాన్‌కానా సాహిబ్ మందిరానికి 10 రోజుల యాత్ర చేపట్టడానికి ప్రభుత్వం సిక్కు భక్తులను అనుమతించింది.
Follow Us