Delhi: ఢిల్లీలో త్వరలో కృతిమ వర్షాలు.. ఎందుకో తెలుసా ? ఢిల్లీలో అక్టోబర్ చివరి నుంచి వాయు కాలుష్యం ఏటా గరిష్ఠ స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్‌లో అక్కడ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. దీనికి అనుమతి కోసం ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. By B Aravind 25 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ముఖ్యంగా అక్టోబర్ చివరి నుంచే ఈ వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలు తగలబెట్టడం, అలాగే చలికాలం కూడా మొదలవడంతో దట్టమైన పొగమంచు వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత చాలావరకు తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వాయు కాలుష్యాన్ని గరిష్ఠ స్థాయికి చేరకుండా అరికట్టేందుకు నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమవుతోంది. Also Read: సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్ నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కృత్రిమ వర్షాలు కురిపించడం కోలం కేంద్ర పర్యావరణ శాఖ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు. రాబోయే చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు 21 పాయింట్ల కార్యచరణ ప్రణాళికను కూడా మంత్రి విడుదల చేశారు. 2016-2023 మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం 34.6 శాతం మేర తగ్గిందని పేర్కొన్నారు. అలాగే గత నాలుగేళ్లలో మొత్తం రెండు కోట్ల చెట్లను మాటామని.. వీటివల్లే వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు. అలాగే డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. #telugu-news #delhi #national-news #rain #artificial-rain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి