సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. By B Aravind 25 Sep 2024 | నవీకరించబడింది పై 25 Sep 2024 18:19 IST in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విచారణపై మూడు నెలల్లోగా నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (MUDA) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటంబ సభ్యులు లాభాలు పొందారని, అలాగే ముఖ్యమంత్రి అధికారాన్ని సైతం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. టి.జె అబ్రహం అనే సామాజిక కార్యకర్త ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. Also Read: ''నన్ను క్షమించండి'' రైతు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కంగనా ఈ నేపథ్యంలో మూడా స్కామ్‌పై వస్తున్న ఆరోపణల్లో సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు కర్ణాటక గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ తనపై విచారణకు పర్మిషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే స్పెషల్ కోర్టు ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, తన భార్యతో పాటు ఇతరులపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించింది. Also Read: లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు! మరోవైపు ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఈ కేసులో పోరాడతానని.. దేనికి భయపడనని పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. #telugu-news #national-news #karnataka #siddaramaiah #muda-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి