ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన స్పీకర్.. మూడు రోజులు సస్పెండ్

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్త 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరు మూడు రోజుల పాటు ఎలాంటి సభా కార్యకాలాపాల్లో పాల్గొనలేరు. అయితే అమానతుల్లా ఖాన్ నేడు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఆయనను సస్పెండ్ చేయలేదు.

New Update
delhi assembly

delhi assembly Photograph: (delhi assembly)

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్త ఆప్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు. మొత్తం 21 మంది ఎమ్మె్ల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరు మూడు రోజుల పాటు ఎలాంటి సభా కార్యకాలాపాల్లో పాల్గొనలేరు. అయితే అమానతుల్లా ఖాన్ నేడు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఆయనను సస్పెండ్ చేయలేదు.

ఇది కూడా చూడండి:This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఇది కూడా చూడండి:TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

ప్రసంగానికి అంతరాయం కలిగించడంతో..

ఇదిలా ఉండగా ఢిల్లీలో ఇటీవల కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఈ క్రమంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు శాసనసభ సమావేశంలోలెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సభలో ప్రసంగించారు. ఈ సమయంలో ఆప్ ఎమ్మెల్యేలుబీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రసంగానికి అంతరాయం కలిగించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. దీంతో స్పీకర్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

ఇది కూడా చూడండి:Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

ఇది కూడా చూడండి:Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

Advertisment
తాజా కథనాలు