Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది . జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ఈ తీర్పు వెలువరించారు.  

New Update
delhi court

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. సరస్వతి విహార్ హింస కేసులో ఆయన్న దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.  జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ఈ తీర్పు వెలువరించారు. సజ్జన్ కుమార్ వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉంటుంది. సజ్జన్ కుమార్ కు ఇది రెండోసారి జీవిత ఖైద. ఇప్పటికే ఢిల్లీ కాంట్ కేసులో సజ్జన్ కుమార్ జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు.

1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులు జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ దారుణంగా హత్య చేయబడ్డారు.  ఈ సంఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉత్తర ఢిల్లీలోని సరస్వతి విహార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ ముందు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఈ ఫిర్యాదు దాఖలైంది.  

ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి సిక్కుల ఆస్తులను పెద్ద ఎత్తున దోచుకోవడం, దహనం చేయడం, ధ్వంసం చేయడంలో ప్రాణాంతక ఆయుధాలతో సాయుధులైన గుంపుకు నాయకత్వం వహించాడని సజ్జన్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. సరస్వతి ప్రాంతంలో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌పై ఆ గుంపు దాడి చేసి చంపింది.  ఈ కేసులోల జస్వంత్ భార్య తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా మాట్లాడుతూ సజ్జన్  కుమార్ జైలు జీవితం గడుపుతున్నప్పటికీ, మరణశిక్షకు అర్హుడు అని అన్నారు.

Also Read :   TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Also Read : తమిళనాడులో త్రిభాషా ఫార్ములాపై రగడ.. హిందీ పేర్లు కొట్టేస్తున్న DMK కార్యకర్తలు

Also read :  భారతీయులకు షాక్ ఇచ్చిన కెనడా ప్రభుత్వం.. స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్..!

Advertisment
తాజా కథనాలు