Operation Mahadev: పహల్గామ్ టెర్రరిస్టులు మావాళ్లే.. దొంగ వాదనతో అడ్డంగా దొరికిన పాక్.. ఇదిగో ప్రూఫ్!

ఆపరేషన్ మహదేవ్‌లో ఇండియన్ ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై చేసింది. డాన్ వార్త పత్రిక రాసిన కథనంతో పహల్గామ్ దాడికి పాల్పడింది పాకిస్తానే అని తెలుస్తోంది. పాకిస్తాన్ పౌరులను ఇండియన్ ఆర్మీ ఫేక్ ఎన్‌కౌంటర్‌లో ఉపయోగిస్తున్నారని డాన్ పత్రిక రాసింది.

New Update
dawn pak media

పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను 98 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ అందులో ఒకడిని మట్టుబెట్టింది. ఆపరేషన్ మహదేవ్‌లో ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ జరిపిన ఎన్‌కౌంటర్‌పై పాక్ మీడియా స్పందించింది. పాకిస్తాన్ పత్రిక రాసిన ఓ ఆర్టికల్ ద్వారా పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తాన్ వాళ్లే అని తెలుస్తోంది. ఉగ్రదాడికి పాల్పడిన వారి గురించ ఫొటోలతో సహా అన్నీ ఆధారాలు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి.

ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను చంపడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఏజెన్సీలు ఎన్‌కౌంటర్లలో నిర్బంధించిన పాకిస్తానీలను చంపుతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే వారిని సీమాంతర ఉగ్రవాదులు అని పిలుస్తున్నాయని పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు ఈ ఉగ్రవాదులను అమాయకులు, పాకిస్తానీలు అని పిలుస్తున్నాయి. కాశ్మీర్ అడవుల్లో ఓ పాకిస్తాన్ పౌరుడు శాటిలైట్ ఫోన్‌, ఆయుధాలతో ఏం చేస్తున్నాడో దాని గురించి డాన్ పత్రికలో రాయలేదు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఓ M4 కార్బైన్ రైఫిల్, 2 AK రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

పాక్ పత్రిక పిచ్చి రాతలు

పాకిస్తాన్ ఆంగ్ల వార్తాపత్రిక డాన్‌లో ఇలా రాసింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఇండియాలో నకిలీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని పాకిస్తాన్ భద్రతా అన్నట్లు పేర్కొంది. భారతదేశంలో 56 మంది పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ వారిని అమాయక పాకిస్తానీ పౌరులు చెప్పుకొస్తోంది. ఇండియాలో జరిగే ఎన్‌కౌంటర్లకు వారిని ఉపయోగిస్తోందని డాన్ న్యూస్ పేపర్‌లో రాసింది. పహల్గామ్ దాడి సూత్రధారి హషీం మూసా పాకిస్తాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి అని రాసుకొచ్చింది. ఉగ్రవాదిని ఎలైట్ యూనిట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో మాజీ కమాండో అని చెప్పడం గమనార్హం. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ చౌదరి షరీఫ్ 723 మంది పాకిస్తానీ పౌరులు భారత జైళ్లలో ఖైదు చేయబడ్డారని పేర్కొన్నారు. కానీ ఈ 723 మంది పాకిస్తానీ పౌరులు సరిహద్దు దాటి భారత్ ఎలా చేరుకున్నారో పాకిస్తాన్ ఆర్మీ చెప్పలేదు. 

Advertisment
తాజా కథనాలు