మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, మేనేజర్ జీకే మోహన్, పర్సనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న బాబీలను ఉద్యోగం నుంచి తొలగించారు. సడెన్‌గా ఈ డెసిషన్ తీసుకోవడంతో ఈ న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనికి కారణం ఆర్థిక వ్యత్యాసాలే అని తెలుస్తోంది. డబ్బులు మేనేజ్ చేయడంలో చాలా తేడాలు వచ్చాయని అందుకే వెంటనే దీంతో వీరిద్దరిని వెంటనే విధుల నుండి తొలిగిపోవాలని చిరు ఆదేశించినట్లు తెలుస్తోంది.
అకౌంట్లలో తేడా..
చిరు పర్శనల్, ప్రోఫెషనల్ అకౌంట్స్‌ను పీఆర్ లే మేనేజ్ చేస్తారు. అయితే గత కొన్నేళ్ళుగా ఈ అకౌంట్స్ డాక్యుమెంటేషన్‌లో చాలా పొరపాట్లు కనిపించాయి. ఇది గ్రౌండ్ స్టాఫ్ చిరు దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై చిరంజీవి విచారించారు. లెక్కలు అన్నీ సరిచేయించి చూశారు. దీంట్లో మోహన్, బాబీల అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు. చిరు వీటిపై ఆరా తీయగా వారు సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో వెంటనే జీకే మోహన్, బాబీలను ఉద్యోగాల నుండి తొలిగించారని చెబుతున్నారు. దాంతో పాటూ జీకే మోహన్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ప్రముఖ కంటెస్టెంట్‌తో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనను జాబ్ నుంచి తొలిగించటానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
Also Read: Delhi: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం