దారుణం.. నీళ్లు తాగి 10 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి  అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.

New Update
Contaminated water kills 10 in Indore, over 2,000 fall ill

Contaminated water kills 10 in Indore, over 2,000 fall ill

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. వరుసగా 8 ఏళ్ల పాటు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు కూడా సాధించింది. ఇలాంటి ప్రాంతాల్లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి  అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు. మున్సిపల్ పైప్‌లైన్‌ల నుంచి వచ్చిన  కలుషిత నీళ్లు తాగాడంతో వాళ్లు డయేరియా, వాంతుల బారిన పడినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: ఇండియాలో లేను..దుబాయ్ లో ఉన్నా..హాదీ హత్య కేసు నిందితుడు

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహరం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వాళ్ల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జోనల్‌ అధికారి, మరో సహాయ ఇంజినీరుపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఇంఛార్జీ ఇంజినీరును విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. 

Also Read: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మే.. జొమాటో, స్విగ్గీ బంపర్ ఆఫర్‌

Advertisment
తాజా కథనాలు