Bangladesh: ఇండియాలో లేను..దుబాయ్ లో ఉన్నా..హాదీ హత్య కేసు నిందితుడు

బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకుడు హాదీ హత్య పెద్ద సంచలనమే సృష్టించింది. ఇతనిని కరీమ్ మసూద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

New Update
kareem

బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హాదీ హత్యా నిందితుడు మేఘాలయా గుండా భారత్ కు పారిపోయి వచ్చాడని బంగ్లాదేశ్ పోలీసులు డప్పు వేసి మరీ చెప్పారు. డీఎస్పీ సైతం ప్రెస్ మీట్ పెట్టారు. కానీ దీని గురించి ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా హాదీను హత్య చేసిన నిందితుడు కరీమ్ మసూద్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తాను భారత్ లో లేనని..ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని తెలిపాడు. అసలు తాను భారత్ కే వెళ్ళలేదని వివరించాడు. అంతేకాకుండా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.  దీనితో పాటూ ఇంకా చాలా విషయాలను కరీమ్ పంచుకున్నాడు. 

తనను కావాలనే ఇరికించారు..

విద్యార్థి నేత హాదీను హత్య చేసింది తానే అయినా...తనను ఇందులో కావాలని ఇరికించారని కరీమ్ ఫైసల్ చెబుతున్నాడు. అందుకే తాను దుబాయ్ పారిపోయానని తెలిపాడు. హాదీతో నాకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం నేను అతడికి రాజకీయ విరాళాలు ఇచ్చాను తప్ప.. అతడిని చంపాల్సిన అవసరం నాకు లేదని చెప్పుకొచ్చాడు.  ఈ హత్య వెనుక జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం హస్తం ఉందని కరీమ్ ఆరోపిస్తున్నాడు. నిందితుడు దుబాయ్ నుంచి వీడియో విడుదల చేయడంతో.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అతడిని పట్టుకునేందుకు ఢాకా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు ఇప్పటికీ ఈ హత్యకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఫైసల్ చేసిన ఆరోపణలు నిజమా? లేక దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు