/rtv/media/media_files/2026/01/01/nationwide-gig-workers-strike-2026-01-01-08-14-56.jpg)
Nationwide gig workers’ strike sends a strong message to platform capitalists
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ట్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (IFAT) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కానీ దీనికి అంతగా స్పందన రాలేదు. తమ సభ్యుల్లో చాలామంది విధులకు దూరంగా ఉన్నట్లు ఈ సంఘాలు తెలిపాయి.
Also Read: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ బిల్లులు విడుదల
ఈ కామర్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై సమ్మె ప్రభావం అంతగా లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం గిగ్ వర్కర్లు నిరసనలు చేశారు. సమ్మెకు AITUC సపోర్ట్ చేసింది. గిగ్ వర్కర్లను కూడా ఫ్యాక్టరీ కార్మికులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేసింది. అయితే సమ్మె ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈకామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ప్రోత్సహకాలను ప్రకటించాయి.
Also Read: ఇండియాలో లేను..దుబాయ్ లో ఉన్నా..హాదీ హత్య కేసు నిందితుడు
బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య సరఫరా చేసే ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు జోమాటో ఆఫర్ ఇచ్చింది. దీనివల్ల రోజుకు రూ.3 వేల ఆదాయం ఉంటుందని హామీ ఇచ్చింది. ఆర్డర్ రద్దు, రిజెక్ట్ చేస్తే ఎలాంటి జరిమానాలు ఉండవని తెలిపింది. మరోవైపు స్విగ్గీ కూడా చెల్లింపులను పెంచింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల మధ్య అనుబంధ డెలివరీ బాయ్స్ దాదాపు రూ.10 వేల వరకు సంపాదించవచ్చని తెలిపింది.
Follow Us