భారతదేశంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే. ఈ ప్రపంచంలో పలు దేశాలు తమ రాజ్యాంగానికి తగ్గట్లు నడుస్తున్నాయి. మరికొన్ని తమ మత ఆచారాల ఆధారంగా పాలించబడుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని మన రాజ్యంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందరినీ సమానంగా చూడాలని.. అందరికీ అవకాశాలివ్వాలని, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చని, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టొచ్చని.. ఇలా అనేక హక్కులన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది.
Also Read: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం..
Constitution Day Of India
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చింది. ఆమోదమయ్యేవరకు రెండు నెలలు ఆలస్యం కావడానికి ఓ కారణం ఉంది. భారత్‌కు స్వాతంత్ర్యం కావాలని 1920-30 మధ్యకాలంలో ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. దశల వారీగా స్వాతంత్ర్యం ఇస్తామని చెబుతూ బ్రిటిష్ వాళ్లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలోనే తమకు వెంటనే స్వాతంత్ర్యం కావాలని.. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ డిమాండ్ చేశారు. ఇందుకోసం భారత స్వాతంత్ర్య డిక్లరేషన్‌ను తయారు చేసి 1929 డిసెంబర్ 31న నెహ్రూ జాతీయ జెండాను కూడా ఎగురవేశారు.
Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే..
చివరికి 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య అనే ప్రకటన కూడా చేశారు. అప్పటినుంచి జనవరి 26ని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా స్వాతంత్ర్యోద్యమకారులు భావిస్తూ వచ్చారు. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఇస్తామనే ప్రకటన చేశాక 1947లో జనవరి 26న ఇవ్వాలని సమరయోధులు కోరారు. కానీ అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీవైపు మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే 1930 జనవరి 26 నాటి 'సంపూర్ణ స్వరాజ్య' ఆశయానికి గుర్తుగా 1950లోకి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు
Also Read: ఆర్బీఐ గవర్నర్‌కు గుండెపోటు!
అయితే రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు నవంబర్ 26ను ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే రోజున జాతీయ న్యాయ దినోత్సవం కూడా. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ రాజ్యాంగ దినోత్సవం మొదటి నుంచి లేదు. 2015 నుంచే ప్రతీ సంవత్సరం నవంబర్ 26న నిర్వహిస్తూ వస్తున్నాం. ఇందుకు కారణం.. 2015లో భారత రాజ్యంగ నిర్మాణ డా.బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం. ఆయన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. దీంతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం.
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్