20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది.

tampering
New Update

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ.. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషమన్‌కు పలు నియోజవకర్గాల జాబితాను పంపింది. అయితే ఇప్పుడు తాజాగా మరో 13 అసెంబ్లీ సీట్ల జాబితాను ఈసీకి పంపింది. ఇప్పటివరకు మొత్తం 20 అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించింది. వీటిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.        

Also Read: తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు!

అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాల రోజున ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు సమయంలో తమ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తాయని పార్టీ హైకమాండ్ ఫిర్యాదులో పేర్కొంది. . మొత్తం ఈ 20 నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని కోరింది. ఫిర్యాదు చేసిన మెమోరాండంలో పానిపట్ నగరానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి వరిందర్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో చాలావరకు ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో 99 శాతం బ్యాటరీ కనిపించిందని తెలిపారు.  పోలింగ్ డే రోజున ఆ రోజంతా ఈవీఎం యంత్రాలు పనిచేసినప్పటికీ ఇలా 99 శాతం బ్యాటరీ చూపించడం అసాధ్యమని పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ హాలులో తమ ఎన్నికల ఏజెంట్లు ఫారం 17సీ కాపీలను తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదని.. దీనివల్ల ఎన్నికల ఏజెంట్లు డేటాను సరిపోల్చలేకపోయారని పేర్కొన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. 

Also Read: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే?

ఫారం 17మ అనేది పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన రికార్డు. ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు ఇది అందజేస్తారు. మరోవైపు రానియా నియోజకవర్గ అభ్యర్థి సర్వ్ మిట్టర్ కూడా ఎన్నికల ఏజెంట్లు ఫారం 17 సీ కాపీలను హాల్‌లోకి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. ఈవీఎం కంట్రోల్ యూనిట్లను మార్చినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఈవీఎం పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో ఈవీఎంలలో బ్యాటరీ శాతం 99 శాతం ఉండగా.. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఈవీఎంల బ్యాటరీ 60 - 70 శాతం ఉందని ఆరోపించారు. అయితే మరీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా.. ప్రతి ఎన్నికలకు కూడా ఇలా ఈవీలంల ట్యాంపరింగ్‌లు జరిగినట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈవీఎంలను బ్యాన్ చేసి.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 

#telugu-news #congress #national-news #haryana #haryana assembly election 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe