/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
Tamilanadu: తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. భాగమతి ఎక్స్ ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దీంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. అయితే, శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్!
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో 1,360 మంది ప్రయాణికులు ట్రైన్ లో ఉన్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ పేర్కొన్నారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే, ట్రైన్ మెయిన్‌లైన్‌కు బదులు లూప్ లైన్‌లోకి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది.
Also Read: నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
The Following Trains are cancelled due to train accident of Train No.12578 #Mysuru – Darbhanga Bagmati Express at Kavaraipettai in #Chennai Division
— Southern Railway (@GMSRailway) October 11, 2024
Passengers are requested to take note on this and plan your #travel #SouthernRailway pic.twitter.com/zhgmRo84l3
అయితే, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16054), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16058), తిరుపతి- పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి- తిరుపతి మెము(16112), డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(16203), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16204), ఉన్నాయి.
Also Read: వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అలాగే, నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్(06746), అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753)తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్(12711), ఎంజీఆర్ సెంట్రల్-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్(06745) రైళ్లు రద్దయ్యాయి.
Also Read: దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం