/rtv/media/media_files/2025/02/17/w6sHbWIufJkeYBVXmndx.jpg)
Sam Pitroda
కాంగ్రెస్ ఓవర్‌సీస్ నేత శామ్ పిట్రోడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతుంటారు. తాజాగా మరోసారి కూడా తన పార్టీ వైఖరికి భిన్నంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందన్నారు. ఆ దేశాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకనుంచైనా భారత్ తన తీరు మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలన్నారు.
Also Read: ఓర్నీ ఎవర్రా మీరంతా.. ఒక ఆటోలో ఇంతమంది ఎలా పట్టార్రా బాబు!
మొదటినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న తీరు ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని అన్నారు. '' మనం అనుసరిస్తున్న విధానం దేశానికి కొత్త శత్రువులను తీసుకొస్తుంది. భారత్‌కు సరైన మద్దతు రావడం లేదు. ఇకనైనా భారత్ తన తీరు మార్చుకోవాలి. కేవలం చైనా విషయంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. చైనా నుంచి ఎలాంటి ముప్పు ఉందో నాకు అర్థం కావడం లేదు. అమెరికా ఎప్పుడూ కూడా చైనాను శత్రువుగా చూస్తూ.. భారత్‌కు సైతం దాన్నే అలవాటు చేస్తోంది.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!
వెనకబడి ఉన్న దేశాలు, పేద దేశాలు వేగంగా అభివద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వృద్ధి రేటు పడిపోతోంది. ఇలాంటి దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత ఎక్కువగా ఉంటున్నారు. వీటన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి. అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్‌ను పెంచుకుంటూ అవసరమైన సమయంలో సహకరించుకుంటూ వెళ్లాలని'' శామ్ పిట్రోడా అన్నారు.
Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!
Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు