మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ ఇటీవల ఆర్టికల్ 370పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించేది లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ధ్వజమెత్తింది.
Also Read: వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ
'' జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించింది. పదేళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఉగ్రవాదాన్ని మాత్రం కట్టడి చేయలేకపోయారు. నిత్యం మన దేశ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014, 2019 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా ? దీనికి అమిత్ షా సమాధానం చెప్పాలని'' మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేడు సజీవంగా బ్రతికి ఉంటే బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయేదని అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని తెలిపారు. ఇకనుంచైనా కేంద్ర హోం మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ సూచించారు. ఇదిలాఉండగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇందిరాగాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలనే ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇలా బదులిచ్చింది.
Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే
ఇదిలాఉండగా మహారాష్ట్రంలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజున పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఝార్ఖండ్‌తో పాటు మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి వస్తారో అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.