Delhi: పొత్తులు లేవు.. ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆప్ తో పొత్తు పెట్టుకోకుండానే...ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది.  ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

author-image
By Manogna alamuru
New Update
delhi

ఢిల్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పింది. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగానే ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల్లో  పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రకటించారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని దేవేందర్ తేల్చి చెప్పారు. 

Also Read :  ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!

ఇక కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని దేవేందర్ యాదవ్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఇండియా కూటమిలో భాగంగా ఆప్, కాంగ్రెస్ కలిసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దేవేందర్ ప్రకటనతో  గత కొన్ని రోజులుగా ఢిల్లీ పాలిటిక్స్‎లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. దీంతో ఢిల్లీలో అధికారం కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. 

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

కసరత్తులు మొదలెట్టిన పార్టీలు..

వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. కేజ్రీవాల్ తన సీఎ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు బీజేపీ.. దేశ రాజధానిని చేజిక్కుంచుకోవాలని చూస్తోంది. ఎలా అయినా ఇక్కడ అధికారం తమ చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 43 కమిటీలను ఏర్పాటు చేసింది. 

Also Read: GDP: నెమ్మదించిన జీడీపీ...అయినా వేగంగా అభివృద్ధి

Also Read :  హైదరాబాద్ లో అరబ్ షేక్ ల అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు