Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ

ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. 

author-image
By Manogna alamuru
New Update
Rahul Gandhi summoned

Rahul Gandhi

పహల్గాం దాడి భారత్ లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. అందరూ పాకిస్తాన్ మీద, ఉగ్రవాదుల మీద పీకల దాకా కోపంగా ఉన్నారు.  దాడులకు ప్రతీకారంగా ఇప్పటికే భారత ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ తో యుద్ధానికి కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ్ ప్రస్తుతం క్షిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని...ఇలాంటి సమయంలో అందరూ కలసి పని చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాని కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాహుల్ గాంధీ..ప్రధాని మోదీని కోరారు. ఉగ్రవాదినిక వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్
ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

అంతకు ముందు కూడా అఖిలపక్ష సమావేశంలో నేతలందరూ ఉగ్రదాడిని ఖండించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న  నాయకులు తెలిపారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ లో కూడా పర్యటించారు.  ఇప్పుడు ప్రధాని మోదీకి రాసిన లేఖలో కూడా రాహుల్ ఇదే చెప్పారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి అని రాహుల్ కోరారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అలాగే స్వతంత్ర అభ్యర్ధి కపిల్ సిబాల్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ  రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం చేయడం ద్వారా దేశం మొత్తం ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఆయన సూచించారు.  

 today-latest-news-in-telugu | pm modi | Rahul Gandhi | letter

Also Read: Canada: కెనడాలో విజయం దిశగా లిబరల్స్..ముందంజలో మార్క్ కార్నీ

Advertisment
తాజా కథనాలు