congress: కాంగ్రెస్ గాయబ్ పోస్ట్ గాయబ్..

తల లేని ప్రధాని మోదీ పోస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శులు వెలువడడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాక బీజేపీ సపోర్టర్లు కూడా కాంగ్రెస్ ను ఈ పోస్ట్ తో ఏకిపారేశారు. 

New Update
Modi headless photo

పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ ఓ వివాదస్పద పోస్ట్ షేర్ చేశారు. తల లేని మోదీ ఫొటో Xలో షేర్ చేస్తూ.. గాడిద తల నుండి కొమ్ములు తప్పిపోయాయని విన్నాను, కానీ ఇక్కడ మోడీ తప్పిపోడని రాశారు. ఇదే పోస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ అఫిషియన్ ఎక్స్ హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య పెద్ద రాజకీయ దుమారం రేగింది. పహల్గామ్ దాడిపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కాలేదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ తలలేని మోదీ పోస్ట్ రీట్వీట్ చేసింది. గాయబ్ అనే క్యాప్షన్‌తో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. దీనిపై బిజెపి ఆగ్రహానికి గురైంది. మోదీ తల తీసి పాకిస్తాన్ మాజీ మంత్రి పోస్ట్ చేస్తే.. దాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందని మండిపడుతున్నారు. #NaughtyCongress తో పాకిస్తాన్ మాజీ మంత్రి పోస్టర్ షేర్ చేశారు.

కాంగ్రెస్ పై బీజేపీ దాడి..

మహల్గాం దా తర్వాత కేంద్ర అఖిల పక్షం నిర్వహించి సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడం వల్లనే కాంగ్రెస్ ఈ పని చేసిందని చెబుతున్నారు. దీనిని పలు సందర్భాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పు కూడా పట్టారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దాంతో బీజేపీ కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది.  ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ ను పాకిస్తాన్  స్నేహితుడు అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో డైరెక్ట్ గా ఎక్కడా రాహుల్ గాంధీ పేరు లేదు. కానీ తెలుపు రంగు టీషర్ట, క్యాప్ ఉన్న వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని ఉన్న ఫోటో ఉంది.  ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ పోస్టు మాయమైంది.

today-latest-news-in-telugu | bjp | pm modi 

Also Read: Breaking:  న్యూజిలాండ్ లో భారీ భూకంపం..

Advertisment
Advertisment
తాజా కథనాలు