Breaking:  న్యూజిలాండ్ లో భారీ భూకంపం..

గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 

author-image
By Manogna alamuru
New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

న్యూజిలాండ్ లో భూమి ద్ధరిల్లింది. భారీ తీవ్రతతో అక్కడి భూమి కంపించింది. రిక్టార్ స్కేలు మీద 6.8 తీవ్రతతో న్యూజిలాండ్ లో భూకంపం వచ్చింది దేశ వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చాయి. దీంతో పాటూ ఇన్వర్ కార్గి
ల్ నగరానికి ఈశాన్యంగా 1200 కి.మీ దూరంలో ఉన్న మాక్వేరీ ద్వీపం ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక న్యూ జిలాండ్ లో భూకంపం ధాటి ఎంత తీవ్రంగా ఉందో తెలియాల్సి ఉంది. దీని ప్రభావం వల్ల ప్రాణ , ఆస్తి నష్టం ఎంత జరిగిందో పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాసేపటి దాకా ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 5 మిలియన్లకు పైగా జనాభా ఉన్న న్యూజిలాండ్ భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణమైన పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‎లో ఉంది. ఇక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 

today-latest-news-in-telugu | new-zealand | earth-quake

Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం

Advertisment
తాజా కథనాలు