Om Brila: అలాంటి దుస్తులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్‌ ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీ షర్టులు ధరించి సభకు రావడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Speaker Om Birla

Speaker Om Birla

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీ షర్టులు ధరించి సభకు రావడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి టీ షర్టు ధరించి సభకు రావొద్దని స్పష్టం చేశారు. ఆ తర్వాత సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' నిబంధనలు, విధానాలతోనే సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి.     

Also read: ఔరంగాజేబు సమాధి వివాదంలోకి చంద్రబాబును లాగిన ఉద్ధవ్.. సంచలన వ్యాఖ్యలు!

కానీ విపక్ష పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు రూల్స్‌ పాటించడం లేదు. ఇది సరైన విధానం కాదు. ఎంత పెద్ద నాయకుడైనా గానీ సభ గౌరవాన్ని తగ్గించేలా ఇలాంటి దుస్తులు ధరించి రావడం సరైందని కాదని'' ఓం బిర్లా అన్నారు. ఈ సందర్భంగా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ్యులు బయటకు వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్రంలో బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  

Also Read: మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్ 

ఈ క్రమంలోనే గురువారం డీఎంకే సభ్యులు నినాదాలు రాసి ఉన్నటువంటి టీషర్టులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. పునర్విభజన న్యాయబద్ధంగా చేయాలి. తమిళనాడు పోరాడుతోంది. తమిళనాడు గెలుస్తుంది అనే నినాదాలు టీషర్టులపై రాసి ఉన్నాయి. అంతేకాదు దీనిపై పార్లమెంటు వెలుపల నిరసనలు కూడా చేశారు. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించారు. చివరికి స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.  

Also Read: సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

Also Read: ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్.. 14 వేల మంది లేఆఫ్ !

Advertisment