/rtv/media/media_files/vxLZHg3OpDlKPPJO6qQb.jpg)
Maharashtra CM Eknath Shinde: మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయి నగరంలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్‌మోటార్ వాహనాలకు టోల్ ఫీజు (Free Toll) వసూలు చేయబోమన ప్రకటన చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. అయితే కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తించనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించకుంది.
Also read: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై!
గతంలో ఆందోళనలు
సీఎం ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శిండే.. గతంలో కూడా అనేకసార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. చివరికి వాటిని ఎత్తివేస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో విషయం ఏంటంటే ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. అలాగే మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ పేరును కూడా మారుస్తూ ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) పేరును ఈ యూనివర్సిటీకి పెట్టనున్నారు.
Also Read: మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్
సామాన్యులకు ఊరట
ఇదిలాఉండగా ఈ నిర్ణయంతో వాహనాదారులకు ముంబయిలో ఉన్న ఐదు టోల్‌ప్లాజాల వద్ద రుసుముల నుంచి విముక్తి లభించింది. దహిసర్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకాల్లో.. కార్లు, ఎస్‌యూవీలు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం టోల్ ఫీజు రూ.45 వసూలు చేస్తున్నారు. ముంబయికి చిన్న వాహనాలతో ప్రవేశించే సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని పలువురు చెబుతున్నారు.
Also Read: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?
ఏక్‌నాథే శిండే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు రాజకీయ స్టంట్లు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య ఘటన అంశంపై ప్రజల దృష్టి మళ్లీంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని శివసే (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు.
Also Read: బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్