CBSE బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్ CBSE 2025 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల సిలబస్‌ను 15శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పిల్లల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడానికి, బట్టీ విధానాన్ని తగ్గించి పిల్లల పై భారం పడకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. By Archana 14 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update CBSE Borad షేర్ చేయండి CBSE Board: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 2025 బోర్డు పరీక్షల్లో 10,12 తరగతులకు సిలబస్‌ను 15% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇండోర్ లో నిర్వహించిన స్కూల్ ప్రిన్సిపాల్ సమ్మిట్ 'బ్రిడ్జింగ్ ది గ్యాప్'లో బోర్డు అధికారి వికాస్ కుమార్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అబ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వడం, బట్టీ విధానాన్ని తగ్గించడం లక్ష్యంగా బోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులు ఫ్రేమ్ వర్క్, అభివృద్ధి అనుగుణంగానే సిలబస్ తగ్గింపు ఉంటుందని CBSE భోపాల్ రీజనల్ ఆఫీసర్ వికాస్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ దీనితో పాటు ఇప్పుడు ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు కూడా పెరిగాయి. 40 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్, 60 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, ఇతర పరీక్షల ద్వారా ఎవాల్యుయేట్ చేస్తారు. విద్యా విధానంలో ఇలాంటి మార్పులు పిల్లలు తమ ప్రాక్టికల్ నాలెడ్జ్, అవగాహనను మెరుగ్గా ప్రదర్శించడానికి సహాయపడుతుందని అగర్వాల్ తెలిపారు. CBSE Class 10, 12 Board Exam 2025: Syllabus reduced by 15%!The syllabus reduction aligns with the board’s evolving educational approach, offering students the opportunity to engage more fully with their subjects,” Agrawal noted.#CBSE | #BoardExam | #TNStreamline pic.twitter.com/wIqwNRy8fW — TN Streamline (@TNStreamline) November 14, 2024 Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి