/rtv/media/media_files/2025/08/17/wang-yi-2025-08-17-07-07-04.jpg)
China Foreign Minister Wang Yi
భారత్, చైనా...ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తూర్పు లడక్ లోని గల్వాన్ లో రెండు దేశాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీని కారణంగా భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఇప్పుడు వీటి పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వచ్చే వారం భారత్ కు రానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కన్ఫార్మ్ చేసింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా వాంగ్ యి ఆగస్టు 18 నుంచి 20 వరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్ మరి కొందరు మంత్రులతో సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్యా విభేదాలు..
చైనా, భారత్ కు మధ్య సరిహద్దు వివాదాలు చాలా ఉన్నాయి. ఒకవైపు లడక్ లోని గల్వాన్ సంఘర్షణలు, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమణలతో పాటూ కోవిడ్ 19 సమయంలో కూడా ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చాయి. గల్వాన్ సంఘర్షణలతో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. అయితే వీటిపై రీసెంట్ గా భారత్, చైనా రెండూ చర్చలు పున:ప్రారంభించాయి. లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్రకు అనుమతి లాంటి విషయాల్లో ఒప్పందం చేసుకున్నాయి. ఇవి మరింత పురోగతి సాధించే దిశలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పర్యటన కీలకంగా మారనుంది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సహకార సంబంధాలు మరింత మెరుగుపడేందుకు కృషి చేయనున్నారు. దీనికి ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా చైనాలో పర్యటించారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అక్కడకు వెళ్ళనున్నారు.
Also Read : ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త