రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సీటు వద్ద వీటిని గుర్తించడం దుమారం రేపింది. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ''గురువారం సభను వాయిదా వేసిన అనంతరం భద్రతా అధికారులు ఛాంబర్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబర్ సీటు వద్ద నోట్ల కట్టను గుర్తించారు.
Also Read: కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?
ఇది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. అందులో రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించాం. ఆ నోట్లు అసలైనవో.. నకిలీవో క్లారిటీ లేదు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాను. ఈ విషయాన్ని సభకు చెప్పడం నా బాధ్యత కాదని'' ధన్‌ఖడ్ అన్నారు. అయితే ధన్‌ఖడ్ చేసిన ప్రకటనపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. దీనిపై విచారణ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. దర్యాప్తు కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తా: కేంద్ర జలశక్తి మంత్రి
మరోవైపు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పేరు చెబితే తప్పేంటనీ.. ఏ సీటు వద్ద డబ్బు దొరికిందో, అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారని తెలిపారు. ఇలా నోట్ల కట్టను సభకు తీసుకురావడం సరికాదన్నారు. దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు. అలాగే రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.