/rtv/media/media_files/2025/09/21/dharmendra-pradhan-2025-09-21-20-12-24.jpg)
Dharmendra Pradhan
త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడుపై విమర్శలు చేశారు. తాము ఏ రాష్ట్రంపై కూడా భాషను బలవంతంగా రుద్దడం లేదని అన్నారు. అలాంటి వాదనలు కేవలం రాజకీయ ప్రేరేపితమని మాత్రమేనని పేర్కొన్నారు. ఆదివారం ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిభాషా అంశంపై మాట్లాడారు. '' ఈ విషయంపై పార్లమెంటులో ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. తమిళనాడు స్కూల్లలో ఇంగ్లీష్, తమిళం, తెలుగు, ఉర్దూ, మళయాళం, కన్నడ లాంటి చాలా భాషలను బోధిస్తున్నారు. తమిళం, ఇంగ్లీష్ కాక చాలా భాషలు బోధిస్తున్నప్పడు మూడో భాష ఉంటే ఇబ్బంది ఏంటి ? ఇది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమే.
Also Read: ఓరి పాపిస్టోడా.. టెస్ట్ డ్రైవంటూ బైక్‌తో పారిపోయావ్ కదరా..! (వీడియో)
ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండు భాషలు అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు మూడు భాషలు బోధించాలి. మాతృభాష అనేది తప్పనిసరిగా ఉండాలి. మిగతా రెండు భాషలు అనేవి విద్యార్థుల ఇష్టం. కేంద్రం ఏ భాషను కూడా బలవంతంగా రుద్దడం లేదు. కేవలం రాజకీయ భావజాలం ఉన్నవారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో కొత్త ఆలోచనను సృష్టించేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని పాటిస్తున్నాయి. సంకుచిత రాజకీయ దృక్పథం ఉన్నవాళ్లు దీన్ని వివాదస్పదం చేస్తున్నారు.
VIDEO | Chennai: Union Education Minister Dharmendra Pradhan at IIT Madras says, “I want to learn Tamil; it is a vibrant language. Learning multiple languages is good, and proficiency in the mother tongue is necessary for it.”
— Press Trust of India (@PTI_News) September 21, 2025
(Full video available on PTI Videos –… pic.twitter.com/8EUDc3eqVI
Also Read: వినియోగదారులకు గుడ్ న్యూస్.. 700కి పైగా అమూల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు!
భాష ఆధారంగా విభజన సృష్టించాలనుకున్న వాళ్లు విఫలమైపోయారు. వాటిని అధిగమించి సమాజం ముందుకు సాగిందని'' ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇదిలా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో (NEP)లో భాగంగా త్రిభాష విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో త్రిభాషా విధానాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. తాము ద్విభాషా సూత్రాన్నే పాటిస్తామని స్పష్టం చేశారు. అప్పట్లో దీనిపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం నడిచింది.