/rtv/media/media_files/2025/05/28/HAX6miZcfrZtv7Nnocd1.jpg)
Justice Yashwant Verma: ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఏప్రిల్ 8 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుండి అగ్నిప్రమాదం జరిగి, భారీగా భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ రిపోర్ట్ ఇచ్చింది.
Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
Delhi: On the government's move to bring an impeachment motion against Justice Yashwant Varma in the Monsoon Session, Congress MP Sukhdeo Bhagat says, “Certainly, the revelations so far are in the preliminary stage. If the government moves an impeachment motion and seeks Congress… pic.twitter.com/aeUXFwJlsG
— IANS (@ians_india) May 28, 2025
Also Read: ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందా? చాట్‌జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!
అభిశంసన మార్గదర్శకాల ప్రకారం
ఆ రిపోర్ట్ ప్రకారం మే 09వ తేదీన అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా జస్టిస్ యశ్వంత్‌వర్మను అభిశంసించి, పదవి నుంచి తొలగించాలన్న సిఫార్సును రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముందుకు సాగాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు మరియు 100 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు అవసరం. ఇది ఆమోదం పొందాలంటే, ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం, అంటే దీనికి బహుళ పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ తీర్మానం విజయవంతమైతే జస్టిస్ వర్మ తొలగించబడిన మొదటి న్యాయమూర్తి కావచ్చు. వర్షాకాల సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.
Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!