New Update
/rtv/media/media_files/2025/04/04/nqNxMp3zfUQ2yyKCCWjS.jpg)
Pinaray Vijayan and veena vijayan
కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన కుమార్తె టి.వీణా విజయన్‌పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారణ చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశించింది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమంగా డబ్బు బదిలీ అయిందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై కొచ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) కేసు దాఖలైంది. సీఎంఆర్‌ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మధ్య అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది. 2017 నుంచి 2020 వరకు సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీకి దాదాపు 1.72 కోట్లు బదిలీ అయినట్లు తెలిపింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌ను నిందితురాలిగా చేర్చింది.
అలాగే సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 పేర్లను నిందితులుగా చేర్చింది. అయితే ఈ కేసులో విచారణ చేపట్టాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఈ కేసులో వీణా విజయన్ దోషిగా తేలితే ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
rtv-news | pinarayi-vijayan | national-news
తాజా కథనాలు