/rtv/media/media_files/2025/08/28/cci-launches-app-for-cotton-procurement-2025-08-28-17-14-29.jpg)
CCI Launches app for cotton procurement
పత్తి రైతులకు ఓ గుడ్‌న్యూస్. మద్దతు ధర అందుకునేందుకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. కపాస్ కిసాన్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పత్తిపంట వేసిన రైతులు ఈ యాప్‌లో వాళ్ల పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు గడువు విధించారు. ఈ యాప్‌లో రిజిస్టర్ అయినవారు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించి మార్కెటింగ్ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు ... అవి కూడా నకిలీవే తెలుసా?
ఈ యాప్ గురించి మరింత సమాచారం కోసం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ముందుగా ఈ యాప్‌లో ఆధార్‌కార్డు, మీ భూమి రికార్డులు, పత్తిపంటకు సంబంధించి రెవెన్యూశాఖ వాళ్లు ఇచ్చిన రికార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దేశంలో పత్తి రైతులు ఎంతమంది ఉన్నారు ? పంట విస్తీర్ణం ఎంత ? అనే వివరాలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర రికార్డు అవుతాయి. మీకు మద్దతు ధర అందాలంటే సెప్టెంబర్ ఆఖరిలోపు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Also Read: దుబాయ్ యువరాణి సంచలన నిర్ణయం.. ఇన్‌స్టాలో విడాకులు..ర్యాపర్‌తో ఎంగేజ్ మెంట్
అయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు.. పత్తిని అమ్మేటప్పడు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏరోజు మీరు పత్తిని CCI కేంద్రానికి తీసుకెళ్లాలో యాప్ వివరాలను పంపిస్తుంది. ఈ పద్ధతిని పాటించడం వల్ల రైతులకు నిరీక్షణ సమస్యలు అనేవే ఉండవు. సెప్టెంబర్ మొదటివారం నుంచి పత్తి పంట అనేది చేతికొస్తుంది. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడటంతో దిగుబడి పెరుగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.