/rtv/media/media_files/2025/08/28/dubai-princess-sensational-decision-2025-08-28-15-58-16.jpg)
Dubai princess' sensational decision.
Dubai Princes: దుబాయ్ యువరాణి షేకా మహ్రా మళ్లీ ఒకసారి వార్తాల్లో నిలిచారు. తాజాగా ఆమె మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సోషల్ మీడియా ఇన్‌స్టాలో భర్తకు విడాకులు(Divorce On Instagram) ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ప్రకటించి సంచలనం రేపారు. ఈ మేరకు ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా(40)తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ర్యాపర్‌మోంటానా అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో దుబాయ్ యువరాణి మరోసారి వార్తల్లో నిలిచింది.
గతేడాది భర్తకు విడాకులు ప్రకటించిన షేకా మహ్రా ఆనాటినుంచి ర్యాపర్‌తో డేటింగ్(Dating) లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విడాకులు ప్రకటించిన కొన్నాళ్లకే షేకా మహ్రా.. మోంటానా తో కలిసి దుబాయ్ వీధుల్లో తిరగడం గమనార్హం. వీరిద్దరూ అనేకసార్లు దుబాయ్ వీధుల్లో.. రెస్టారెంట్లలో కలిసి కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ వీరు దర్శనమిచ్చారు. అప్పటికే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఎవరీ షేకా మహ్ర...
షేకా మహ్రా దుబాయ్ రాజు యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు. 31 ఏళ్ల మహ్రా బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు. ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా తీసుకున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహ్రాకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో 2023 మే 27న వివాహం జరిగింది. అయితే, ఈ బంధం ఎంతోకాలం నిలువలేదు. గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన మహ్రా ఆ తర్వాత కొంతకాలానికే భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ‘ఐ డివోర్స్ యూ’(I Divorce You) అంటూ ఇన్‌స్టాలో విడాకుల ప్రకటన చేసి సంచలనంగా మారారు. ఆ తర్వాత ‘డివోర్స్’ పేరుతో పర్‌ఫ్యూమ్ విక్రయాలు ప్రారంభించడం విశేషం.
మోంటానా గురించి...
ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా మొరాకో అమెరికన్. అయన అసలు పేరు కరీం ఖర్బౌచ్. వయస్సు 40 ఏండ్లు. ‘అన్‌ఫర్‌గటబుల్’, ‘నో స్టైలిస్ట్’ వంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందాడు. మోంటానా గతంలో వ్యాపారవేత్త అయిన నదీన్‌ను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఆయనకు 16 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఉగాండా, ఉత్తర ఆఫ్రికా అంతటా ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రాజెక్టులకు కోసం ఆయన నిధులు సమకూర్చడం ద్వారా, దాతృత్వంతో ఖ్యాతిని గడించారు.
Also Read : September Bank Holidays : సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులు బందే.. లిస్టు ఇదే!