/rtv/media/media_files/2025/11/16/bride-to-be-killed-by-fiance-2025-11-16-18-16-42.jpg)
Bride To Be Killed By Fiance Hour Before Wedding After Fight Over Saree
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి గంట ముందు నూతన వధువరుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో కాబోయే భార్యను వరుడు హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాజన్ బరయ్య, సోని హిమ్మత్ రాథోడ్ ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ల కుటుంబాలకు ఇది ఇష్టం లేదు. దీంతో ఏడాదిన్నరగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
Also Read: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. అక్కడే దొరికిన మూడు బుల్లెట్లు
చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నవంబర్ 15 న రాత్రి ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేసి బంధువులు, స్నేహితులకు ఆహ్వానం పలికారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెళ్లి కార్యక్రమాలు జరిగాయి. మరో గంటలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. అదే సమయంలో పెళ్లి చీర, డబ్బుల విషయంలో వధువరుల మధ్య గొడవ జరిగింది. దీంతో వరుడు.. వధువును రాడ్‌తో కొట్టాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకేసి కొట్టాడు. ఇంట్లో వస్తువులు కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
వధువు విగతజీవిగా పడిఉండటాన్ని చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరడు సాజన్ బరయ్యపై హత్య కేసు నమోదు చేశారు. అతడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. అంతేకాదు పెళ్లి రోజునే అతడు మరో వ్యక్తితో కూడా గొడవ పడ్డాడని దీనిపై కూడా కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Follow Us