Scheme: అబ్బాయిలకు అదిరిపోయే స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే రూ.11.5 కోట్లు..  ఎలాగంటే?

అమ్మాయిల భవిష్యత్తుకు భరోసాగా సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో స్కీమ్‌లు  ఉన్నాయి. కానీ అబ్బాయిల కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కీమ్స్ లేవు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్యను అందుబాటులోకి తెచ్చింది.

New Update
GST Cut Benefits Reaching Consumers, Price Drop Bigger Than Expected, Says Nirmala Sitharaman

GST Cut Benefits Reaching Consumers, Price Drop Bigger Than Expected, Says Nirmala Sitharaman

అమ్మాయిల భవిష్యత్తుకు భరోసాగా సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో స్కీమ్‌లు  ఉన్నాయి. కానీ అబ్బాయిల కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కీమ్స్ లేవు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్యను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్ల లోపు వయసున్న ఏ పిల్లల పేరు మీదనైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ముఖ్యంగా ఈ స్కీమ్ మగపిల్లలకు గొప్ప వరమని చెప్పవచ్చు. దేశంలోని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా నెలకు కేవలం రూ.1,000 పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో చక్రవడ్డీ ద్వారా డబ్బు అందుతుంది. మీరు ఇందులో పెట్టే చిన్న పెట్టుబడి సుదీర్ఘ కాలంలో ఊహించని విధంగా పెరుగుతుంది. ఉదాహరణకు మీకు బిడ్డ పుట్టిన వెంటనే నెలకు రూ.1,000 చొప్పున పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆ బిడ్డకు 60 ఏళ్లు వచ్చేసరికి మీరు కట్టే మొత్తం కేవలం రూ. 7.2 లక్షలు అవుతుంది. కానీ సగటున 14 శాతం వడ్డీ రేటు లభిస్తే మెచ్యూరిటీ సమయానికి ఆ నిధి సుమారు రూ.11.5 కోట్లుగా మారుతుంది.

ఇది కూడా చూడండి: Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

కాలం గడిచేకొద్దీ డబ్బు పెరిగే వేగం కూడా పెరుగుతుంది. మీరు దీన్ని 30 ఏళ్ల కాలపరిమితికి పెట్టుకుంటే నెలకు రూ.1,000 చొప్పున 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే సుమారు రూ. 62 లక్షల నిధి జమ అవుతుంది. ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత చదువులకు, విదేశీ ప్రయాణాలకు లేదా వారి వివాహ ఖర్చులకు, సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు. నగదు విత్‌డ్రా, పెన్షన్ సౌకర్యం కూడా ఈ పథకంలో ఉంది. మీరు 30 ఏళ్ల తర్వాత కూడా జమ అయిన మొత్తంలో 60 శాతం వరకు అనగా సుమారు రూ.37 లక్షలు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం సొమ్మును అలాగే ఉంచితే దాని ద్వారా మీ బిడ్డకు నెలకు సుమారు రూ.12,000 వరకు పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ పథకం ఒకే సమయంలో భారీ నిధిని, జీవితాంతం పెన్షన్‌ను రెండింటినీ అందిస్తుంది.

ఇది కూడా చూడండి: Andhra Pradesh: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఇందులో ఖాతా తెరవడం ఎలా?

ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను ప్రారంభించడం చాలా ఈజీ. మీ దగ్గరలోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లవచ్చు లేదా పోస్టాఫీసులో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలనుకుంటే ఎన్‌పీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు